లంబోదరునికి పేలాలతో ప్రసాదం.. ఎలా చేయాలంటే.?
08 September 2024
Battula Prudvi
మూడో రోజున లంబోదరునికి పేలాలను నైవేద్యంగా సమర్పిస్తారు. మరి పేలాలు కాకుండా.. పేలాల పిండి తయారు చేసి నైవేద్యంగా పెట్టండి.
అయితే దానిని ఎలా తయారు చేయాలి..? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి..
పేలాల పిండి తాయారు చేయడానికి కావలిసిన పదార్థాలు పేలాలు- ఒక కప్పు, బెల్లం తురుము- ఒక కప్పు, యాలకుల పొడి- ఒక టీస్పూన్, బాదం పప్పు-10, జీడిపప్పు-10
దీని తయారీ కోసం ముందుగా స్టౌ ఆన్ చేసి దానిపై బాండీ పెట్టి.. జీడిపప్పు వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి.
అలాగే అదే బాండీ బాదంపప్పును కూడా వేసుకొని బాగా వేయించుకోని దీన్ని ఓ ప్లేటులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో మీకు కావలసిన అన్ని పేలాలు వేసి మెత్తగా పొడి అయ్యేవరకు మిక్సీ పట్టాలి.
ఆ తర్వాత పొడిలో బెల్లం వేసుకుని మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మళ్లీ ఆ పొడిలో యాలకుల పొడి వేసుకుని మిక్సీ చేసుకోవాలి.
అనంతరం ఓ ప్లేట్ తీసుకొని ఆ పొడి వేసి.. అందులో వేయించిన జీడిపప్పు, బాదంపప్పు వేసి కలుపుకుంటే పేలాల పిండి ప్రసాదం సిద్ధం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి