నట్టింట్లో కృష్ణుడి చిట్టి పాదాలను చేతి పిడికిలితో ఇలా వేయండి
హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని గోకులాష్టమి, కృష్ణాష్టమి అన్న పేర్లతో పిలుచుకుంటారు.
కృష్ణాష్టమి వచ్చిందంటే మా ఇంటికి రావయ్యా కన్నయ్యా అంటూ ఆహ్వానిస్తూ నట్టింట్లో కృష్ణుడి పాదాలను పిడికిలితో వేస్తారు.
దీని కోసం బియ్యం, మినపప్పు విడిగా నానబెట్టి రుబ్బుకోవాలి. చేతి పిడికిలిని పిండిలో ముంచి అచ్చుల్లాగా నేలమీద వేయడంతో అవి సేమ్ చిన్న పిల్లల అడుగుల్లాగే కనిపిస్తాయి.
ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కృష్ణుని వేషధారణ వేసి సంబరపడిపోతారు.
ఈ రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు.
శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం ఇంకా వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి చిట్టి కన్నయ్యను ఊపుతారు.
ఇక కాలనీలోని సొసైటీ వారు తమ వీధుల్లో ఉట్టి కొట్టే పోటీలు నిర్వహించి యువతకు పరీక్ష పెడతారు.