వినాయకుడు దేశవ్యాప్తంగా తొలి పూజలు అందుకుంటూ పూజలో, పనిలో స్వర్వ విఘ్నాలను తొలగిస్తూ కోరిన కోరికలు తీర్చుతాడు.
గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లోనూ ఒక్కో పేరుతో రోజుకో తీరున వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
పూజా విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మరి మొదటి రోజు గణపతికి పూజ ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంది. మొదటి రోజున గణపతిని "వరసిద్ధి వినాయకుడు"గా పూజలు నిర్వహిస్తారు.
మొదటి రోజూ వినాయక చవితి నాడు.. గణపతిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో పూజించాలి.
ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని, పూజ గదిని శుభ్రం చెయ్యాలి. తర్వాత తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఇంటినీ, పూజా మందిరాన్నీ పసుపు, కుంకుమ, తోరణాలతో అలంకరించాలి.
కుటుంబమంతా కలిసి కూర్చొని ఇంట్లో ఉన్న పూజామందిరంలోగానీ, తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగాలలో గణపతి పూజ చెయ్యాలి.
అక్కడ విగ్రహంపై పాలవెల్లి కట్టి ఆపై వినాయకుడికి ఇష్టమైన పండ్లను ఉంచి. షోడశ లేదా అష్టోత్తర శత నామాలతో, 21 రకాల పత్రాలతో పూజించి ప్రసాదాలు సమర్పించాలి.