శ్రీరామ మందిరంలో ఎన్ని బంగారు తలుపులు అమర్చారు?
TV9 Telugu
17 January 2024
యావత్ భారతదేశం ఎన్నో ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం మరికొన్ని రోజుల్లోనే కళ్ళముందుకు రానుంది.
ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగబోతుంది.
శ్రీరాముడి విగ్రహం నుంచి ఆలయ తలుపుల వరకు ప్రతి వస్తువును ప్రత్యేకంగా ఎంపిక చేశారు. తలుపుల కోసం మహారాష్ట్ర, తెలంగాణ నుంచి పత్యేక కలప తెప్పించారు.
ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు అయోధ్యలోని రామ మందిరంలో తొలి బంగారు తలుపుని ఏర్పాటు చేశారు మందిర నిర్మాణ అధికారులు.
రామ మందిరంలో ఈ బంగారు తలుపు 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇందుకు సంబంధించి ఫోటోలు విడుదల.
మొదటి బంగారు తలుపు మొదటి అంతస్తులో అమర్చడం జరిగింది. మరో 13 బంగారు తలుపులు కూడా త్వరలోనే అమర్చనున్నారు.
అయోధ్య శ్రీ రామ మందిరంలో మొత్తం 46 ద్వారాలు ఉంటాయి. వాటిలో 42 ద్వారాలకి 100 కిలోల బంగారు పూత పూయనున్నారు.
మెట్ల దగ్గర ఉండే నాలుగు తలుపులకి మాత్రం బంగారు పూత వేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. 1000 సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉండేలా వీటిని రూపొందించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి