సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా అది చాలా వరకు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం, విహార యాత్రకు వెళ్లడం, విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారు.
ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటే ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అష్టమ శని కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలతో మీరు చేపట్టిన ప్రతి పనీ పూర్తవుతుంది.
భవిష్యత్తులో ఉపయోగపడగలిగిన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యక్తిగతంగా కాస్తంత పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరిగినా అందుకు తగిన ప్రతిఫలం అందుతుంది.
అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తే అవి తప్పకుండా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం మంచిది. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు.
వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం మామూలుగా సాగిపో తుంది.
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు. మనసులోని చిరకాల వాంఛ ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది.
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు. మనసులోని చిరకాల వాంఛ ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది.
ఏలిన్నాటి శని కారణంగా వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయ్యే అవ కాశం ఉండదు. బద్ధకానికి, కాలయాపనకు అవకాశం ఇవ్వవద్దు. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి.
శుభకార్యాలు, పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీ కరిస్తారు.