స్థిరాస్తి కొనుగోలు చేయడం గానీ, స్థిరాస్తి విలువ పెరగడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది.
కుటుంబ విషయాలలో చిక్కులు తొలగిపోతాయి. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా కాస్తంత పురోగతి ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులకు కళ్లెం వేయగలుగుతారు. అవసరమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూమికి సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాలలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం అవ సరం. అకారణంగా వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగు తుంది. వివాహ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వారమంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాల వల్ల పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, చికాకులు ఏమైనా ఉంటే, అవి సునాయాసంగా పరిష్కారం అవుతాయి.
వృత్తి, ఉద్యోగాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తమ కార్యకలాపాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో పని భారం ఉన్నప్పటికీ ముఖ్యమైన బాధ్యతలను సమర్థవం తంగా నిర్వర్తిస్తారు. స్థిరాస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి.
ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. నిర్ణయాలు, ఆలోచనలు కార్యరూపం ధరిస్తాయి.
ముఖ్యమైన కార్యకలాపాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
చాలా కాలంగా వేధిస్తున్న ఆస్తి సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.
ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. కొన్ని ప్రయత్నాలు ఆలస్యం అయిన ప్పటికీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.