ఇటుకలు,రాళ్ల వర్షం కురిపిస్తూ హొలీ ఆడుకునే గ్రామస్థులు 

17 March 2024

TV9 Telugu

Pic credit - Pexels

దేశంలో హోలీ పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. రంగులతో, పువ్వులల్తో కర్రలతో మిఠాయిలతో మాత్రమే కాదు రాళ్లతో కూడా హొలీ ఆడతారు

హోలీ పండుగ 

పిల్లలు పెద్దలు ఇష్టపడే రంగుల పండగ సందడి మొదలైంది. జార్ఖండ్‌లోని లోహర్‌దగాలోని బర్హి గ్రామంలో హోలీని ప్రత్యేకంగా జరుపుకుంటారు. 

లోహర్దగా

బర్హి గ్రామంలో ఇటుకలు, రాళ్ల వర్షం కురిపిస్తూ హోలీ జరుపుకుంటారు. దీనిని 'ధేలా మార్ హోలీ' అని కూడా అంటారు. 

ఇటుకలు ,రాళ్ల వర్షం

దశాబ్దాలుగా ఈ గ్రామంలో రాళ్లతో, ఇటుకలతో హోలీని ఆడుతున్నారు. బర్హిలోని దేవి మండపం దగ్గర హోలికా దహన్ నిర్వహిస్తారు. ఇక్కడ ఒక చెక్క స్తంభాన్ని పాతిపెడతారు.   

దశాబ్దాలుగా హోలీ

హోలీ రోజున కొయ్య స్తంభాన్ని తాకేందుకు ప్రజల మధ్య పోటీ నెలకొంటుంది. ఈ స్తంభాన్ని తాకిన వారికి సుఖం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయని నమ్ముతారు.

స్పెషాలిటీ ఏమిటంటే 

చెక్క స్తంభాన్ని తాకేందుకు ప్రజలు పరిగెత్తినప్పుడు ప్రేక్షకులుగా హాజరైన గ్రామస్థులు స్తంభాన్ని తాకేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై రాళ్లు విసురుతారు 

స్తంభాన్ని తాకడానికి రేసు 

రాళ్లు తగిలినా గాయపడరని స్థానికులు చెబుతారు.  అయితే గ్రామస్థులు మాత్రమే ఈ సంప్రదాయం హొలీలో పాల్గొనాలి. బయటి వ్యక్తులు ప్రేక్షకులుగా పాల్గొంటారు. 

గాయపడని ప్రజలు