లోకాన్ని అల్లకల్లోలం చేయమని తన రూపాలకు పార్వతి ఆదేశం..
TV9 Telugu
28 August 2024
తల్లి పార్వతికి ఇచ్చిన మాట మేరకు తండ్రి శివయ్యను ఏదిరించి చిన్నిగణపతి ప్రాణాలు కోల్పోయిన వృత్తాంతం తెలిసిందే.
తర్వాత మహాశివుడు వినాయకుడికి గజరాజు తలపెట్టి మరోసారి ప్రాణం పోయడం, దీంతో పార్వతి సొంతోషించడం ఇది అంత తెలిసిందే.
ఈ మధ్యలో చాలామందికి తెలియని విషయం ఒకటి జరిగిందని పపురాణాలు చెబుతున్నాయి. ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించిన పార్వతి మాత లోకాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంది.
తన అవతారాలైన ఖంజ, కాళి, కరాళి, బగళ, ఛిన్నమస్త, ధూమవతి, మాతంగి మొదలైన వేలాది శక్తులను పిలిచి లోకాన్ని అల్లకల్లోలం చేయమంది పార్వతి.
అంతే! మాత పార్వతి ఆదేశలతో జగన్మాతలంతా కలిసి దేవతలను మింగేశారు. లోకాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు.
ఇది తట్టుకోలేని విష్ణ్వాది దేవుళ్లందరూ కలిసి ఏనుగు తలను తెచ్చి, బాలునికి అతికించి, మళ్లీ బతికించి పార్వతిని ప్రసన్నం చేసుకున్నారు.
అదీ స్త్రీశక్తి, అదీ మాతృశక్తి, పురుషులంతా కలిసినా ఆ శక్తి రూపిణిని ఏమీ చేయలేక ఆ పరాశక్తికి దాసోహమన్నారు.
తన సతీమణి పార్వతిని మరింత సంతోషపెట్టడానికే శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి గణాధిపత్యాన్ని కట్టపెట్టాడు.
తల్లి సంకల్పిస్తే తనయులకు ఏ లోటూ లేకపోవడమే కాదు.. ఉన్నత స్థానమూ లభిస్తుందని దీని ద్వారా తెలుస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి