రాఖీ పండుగ వేళ ఈ పరిహారాలతో లక్ష్మీదేవి అనుగ్రహం.. 

TV9 Telugu

18 August 2024

లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడిన శ్రావణ పూర్ణిమి రోజున కొన్ని రకాల పరిహారాలను చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

రక్షా బంధన్ పండుగ రోజు తమ సోదరులు, సోదరీమణుల ఆశీస్సులతో పాటు తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి.

ఇలా చేస్తే మీ లైఫ్ లో కచ్చితంగా సక్సెస్ రావటమే మాత్రమే కాదు మేధస్సు, బలం, సమాజంలో గౌరవం పెరుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది.

అంతేకాదు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సులభంగా అధిగమించే సామర్థ్యాన్ని పొంది ప్రతి రంగంలోనూ అసాధారణమైన ప్రతిభను కనబరుస్తారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాఖీ పౌర్ణమి రోజున సోదర, సోదరీమణులు చంద్రుడితో పాటు నవ గ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి మంత్రాలను పఠించాలి.

ఇలా చేస్తే జాతకంలో గ్రహ దోషాలన్నీ తొలగిపోయి గ్రహాల ప్రతికూల ప్రభావం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. పనులన్నీ సకాలంలో అయిపోతాయి.

రాఖీ పౌర్ణమి పర్వదినాన సోదరుడు, సోదరీమణులందరూ ఆహారం, మీ సామర్థ్యం మేరకు సొమ్మును పేదలకు దానం చేయాలి.

ఈ పవిత్రమైన రోజున దాన ధర్మాలు చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది.