ఇంట్లో వినాయకుడిని ఏ దిశలో ఉంచాలో తెలుసా 

11 September 2023

ఆది పూజ్యుడు గణపతికి ఏదైనా శుభకార్యం ప్రారంభించడానికి  ముందు పూజలు చేయాలి. లేదంటే చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలు ఏర్పడతాయని విశ్వాసం

వినాయక చవితి వేడుకలను ఇంట్లో మాత్రమే కాదు ఢిల్లీ  నుంచి గల్లీ వరకూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా జరుపుకుంటారు. వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు

వాస్తు శాస్త్రంలో ఇంట్లో వినాయకుడి విగ్రహం లేదా బొమ్మను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లో ప్రతికూల శక్తి రాదని విశ్వాసం.   

అయితే ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఖచ్చితంగా ఏ దిశలో పెట్టుకోవాలనేది తెలుసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే జీవితంలో అనేక సమస్యలు వస్తాయట

వాస్తు శాస్త్రం ప్రకారం గణేశ విగ్రహాన్ని ఇంట్లోని ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోరాదు

ఇంట్లో వినాయకుడు విగ్రహాన్ని తెచ్చే ముందు భంగిమ విషయంలోనూ నియమాలు పాటించాలి.  లలితాసనంలో కూర్చున్న వినాయకుడు శుభప్రదం

గణపతి శయన భంగిమలో విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించవచ్చు. ఈ గణపతి భంగిమ విలాసాన్ని, సౌఖ్యాన్ని, సంపదకు చిహ్నంగా పరిగణింపబడుతుంది

ఇంట్లో పెట్టుకునే గణపతి తొండం ఎడమవైపుకి తిరిగి ఉండాలి. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే.. సక్సెస్ తో పాటు.. సానుకూల శక్తి లభిస్తుందని విశ్వాసం