ఈ ఏడాది ఖైర‌తాబాద్ వినాయ‌కుడు ఎలా దర్శనం ఇవ్వనున్నాడంటే..

15 September 2023

  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహం. ఏడాదికో రూపంలో దర్శనమిచ్చే గణపయ్య ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా రూపుదిద్దుకుంది

    హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన గణపతి విగ్రహం ఈ ఏడాది శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో కొలువు కొలువుతీరనున్నాడు

  ఆది పూజ్యుడు పార్వతి నందనుడు గణపయ్య విగ్రహం ఎత్తు తక్కువ ఎక్కువలతో పనిలేకుండా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు

  తలపై ఏడు సర్పాలు గొడుగు పట్టగా తన భక్తులను నిల్చునే శ్రీ దశమహా విద్యాగణపతి’ భక్తులను అనుగ్రహించనున్నాడు. విగ్రహం వెనుక సంస్కృతంలో రాసిన గ్రంథం ఏర్పాటు చేశారు. 

  స్వామివారి విగ్రహం పది చేతుల ఉండగా.. తన కుడి వైపు ప్రధాన చేతితో భక్తులను ఆశీర్వదించనున్నారు. మిగిలిన చేతుల్లో దండ, ధాన్యం, కత్తి, బాణం, పుస్తకం వంటివి ధరించి దర్శనం ఇస్తున్నారు. 

  ప్రధాన మండపం రెండు వైపులా శ్రీపంచముఖ లక్ష్మీనారసింహస్వామి ఒకవైపు, శ్రీ వీరభద్రస్వామి మరోవైపు.. విఘ్నేషుడి మండపంలోనే సరస్వతీ దేవి, వరాహ దేవి కొలువు కానున్నారు.

  ఈ ఏడాది స్వామి దర్శనానికి రాలేని భక్తుల కోసం ఆన్‌లైన్ దర్శనం, ఆన్‌లైన్ పూజ, ఇంటి వద్దకే ప్రసాదాన్ని పంపిణీ చేసే సదుపాయాలను అందుబాటులోకి తీసుకుని వచ్చారు.