02 October 2023
కొంతమందికి రంగురంగుల కప్పలు కలలోకి వస్తాయి. మరికొందరికి కప్పను తొక్కినట్లు, కప్పను పట్టుకున్నట్లు కూడా కలగంటారు.
కప్పలు గడ్డి దుబ్బుల్లో, పొలాలు, నది వంటి వాటిల్లో ఉన్నట్లు కలలోకి వస్తే అదృష్టానికి సంకేతం. చేపట్టిన పని సక్సెస్ అవుతుంది. సంతోషంగా ఉంటారని సంకేతం.
కప్పను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కల వస్తే.. మీ జీవితానికి సంబంధించిన వ్యక్తిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అర్ధమట
కప్ప మీపై దాడి చేసినట్లు కల వస్తే.. మీ శక్తి మేరకు పనిని చేయడంలో ఎదురైన వైఫల్యానికి సంకేతంగా ఈ కలను భావించవచ్చు.
కప్ప వణుకుతున్నట్లు కలలోకి వస్తే శుభసంకేతమట. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నావారిని కలుసుకోనున్నారని సంకేతం.
కప్పను చంపినట్లు కల వస్తే.. అది శత్రువుపై విజయానికి సంకేతం. లేదా సన్నిహితుల మరణానికి ముందస్తు హెచ్చరిక అని కొందరి నమ్మకం.
ఆకుపచ్చ కప్పలు కలలోకి వస్తే శుభవార్త వింటారు. మరీ ముఖ్యంగా మీ మానసిక , భావోద్వేగ ఆరోగ్యాన్ని సూచిస్తుంది.