దక్షిణ భారతంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ పురాతన ఆలయాలు..
TV9 Telugu
29 October 2024
భారతదేశంలోని అనేక ప్రసిద్ధ దేవాలయాలు భక్తులను పెద్ద సంఖ్యలో ఆహ్వానిస్తున్నాయి. ప్రతి ఆలయంలో వివిధ దేవుళ్లను పూజిస్తారు.
దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో తిరుమల ఏడవ శిఖరంపై కొలువైన శ్రీవేంకటేశ్వర ఆలయం ఒకటి. దీనిని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు.
కర్ణాటక విజయనగర జిల్లాలోని హంపిలో విరూపాక్ష దేవాలయం దేశంలోని అత్యద్భుత నిర్మాణాల్లో ఒకటి. పరమశివుడు విరూపాక్షుడిగా దర్శనమిస్తాడు.
కేరళలోని పశ్చిమ కనుమల్లో శబరి కొండపై కొలువైన దేవుడు అయ్యప్ప. ఈయనను హరిహరసుతుడిగా భావించి భక్తులు నియమనిష్ఠాలతో పూజలు చేస్తారు.
51 శక్తిపీఠాలలో 18 మహా శక్తిపీఠ దేవాలయాలలో ఒకటి చాముండేశ్వరి ఆలయం. మైసూర్‌లోని చాముండి కొండలపైన వెలసిన అత్యంత ప్రసిద్ధ దేవాలయం.
చెన్నైలోని జార్జ్ టౌన్ నడిబొడ్డున తంబు చెట్టి వీధిలో ఉన్న కాళీకాంబళ్ ఆలయంలో కోరిన కోర్కెలు తీర్చే కామాక్షి, కామదేశేశ్వరుడు కొలువై ఉన్నారు.
కర్ణాటక మైసూరు సమీపంలోని కపిల నది ఒడ్డున ఉన్న నంజుండేశ్వరుని ఆలయంలో శివుడు కొలువై ఉన్నారు.
వేల ఏళ్ళ చరిత్ర కలిగిన శివుడి దివ్య దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి నంజుండేశ్వరుని ఆలయనికి భక్తులు వస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి