నవరత్నాల్లో ఏ రాయి ఉంగరంతో ఎలాంటి ప్రయోజనలో తెలుసా.? 

05 July 2025

Prudvi Battula 

మాణిక్యం: ఇది సూర్యునికి ప్రతీక. మాణిక్యం పొదిగిన ఉంగరం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, అంతర్గత బలాన్ని పెంచుతుందని నమ్ముతారు.

ముత్యం: ఇది చంద్రునికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రశాంతత, స్వచ్ఛత, భావోద్వేగ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ముత్యంతో ఉన్న ఉంగరంతో ధరిస్తే అన్ని శుభాలే.

వజ్రం: వాజ్రపు ఉంగరం ధరిస్తే శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. ఇది స్వచ్ఛత, బలం, శాశ్వతమైన ప్రేమను సూచిస్తుందని భావిస్తారు.

పగడం: ఇది కుజుడు పాలించే ఈ రత్నం. బలం, రక్షణ, దృఢ సంకల్పాన్ని తెస్తుందని నమ్ముతారు. పగడపు ఉంగరం ధరిస్తే కుజదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరకతం: దీనికి బుధుడు పాలకుడు. పచ్చ ఉన్న ఉంగరం ధరిస్తే మేధో సామర్థ్యాలను, సంభాషణ నైపుణ్యాలను పెంచుతుందని నమ్ముతారు.

పుష్యరాగం: బృహస్పతి పాలించే రత్నం ఇది. శ్రేయస్సు, అదృష్టం, వృద్ధి కోసం పుష్యరాగం పొదిగిన ఉంగరం ధరిస్తారు.

వైఢూర్యం: ఈ రత్నానికి కేతువు పాలకుడు. వైఢూర్యం పొదిగిన ఉంగరం ఆధ్యాత్మిక అంతర్దృష్టిని పెంచుతుందని, ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుందని నమ్ముతారు.

గోమేధికం: రాహువు పాలించే ఈ రత్నం పొదిగిన ఉంగరాన్ని ధరించడం ఆశయం, విజయం, అడ్డంకులను అధిగమించడాన్ని సూచిస్తుంది.

నీలమణి: ఈ రత్నం శనిచే పాలించబడుతుంది. ఇది స్థిరత్వం, దృష్టి, ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణను సూచిస్తుందని నమ్ముతారు. నీలమణి ఉంగరం ధరిస్తే శని దోషం తగ్గుతుంది.