నవరాత్రి మూడవ రోజు లంబోదరుని కథ ఏంటో తెలుసా.?

08 September 2024

Battula Prudvi 

సముద్ర మథనంలో లభించిన అమృతాన్ని రాక్షసులకు అందకుండా దేవతలకు అందించడం కోసం శ్రీమన్నారాయణుడు మోహినీ రూపం ధరించాడు.

శివుడు ఆమెపై మోహంలో పడి వెంటాడగా, మోహిని తనని వంచించి మాయమైంది. ‘కామాత్‌ క్రోధో అభిజాయతే’ కామం తీరని శివుడు క్రోధావిష్టుడు అయ్యాడు.

మోహిని వల్ల తమకం కారణంగా వీర్యస్ఖలనమై దుష్ప్రదేశంలో పడగా దాని నుంచి క్రోధాసురుడనే రాక్షసుడు ఉద్బవించాడు.

శుక్రాచార్యుని నుంచి సూర్య మంత్రం పొంది ఘోరమైన తపస్సు చేసి ముల్లోకాలనూ జయించే శక్తిని, మృత్యురాహిత్యాన్ని, లోకప్రసిద్ధిని వరాలుగా పొందాడు.

వేశపురిని రాజధానిగా చేసుకున్నాడు క్రోధాసురుడు. అతని భార్య ప్రీతి. ఈ అసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు.

దాంతో దేవతలు, మునులు అంత కలిసి విఘ్నధిపతి అయినా వినాయకుడుని ఆశ్రయించడంతో.. ఆయన క్రోధాసురుని పీచమణచాడు.

క్రోధాసురుడు లంబోదరుడిని శరణువేడగా దుష్టశిక్షణాదులందు తప్ప నీవు లోకంలోకి రావద్దని ఆదేశించి, క్రోధుని తన నేత్రాల్లో ఇమిడి పొమ్మన్నాడు.

ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యాకార్య విచక్షణ కోల్పోతారు. కాబట్టి ఎవ్వరూ వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు.