శ్రీరాముడు విరిచిన ధనుస్సు పేరు తెలుసా.?

TV9 Telugu

11 June 2024

రామాయణం అంటే ఇతిహాసం మాత్రమే కాదు.. మానవులు ఎలా నడుచుకోవాలో తెలిపే ఒక మంచి గురువు లాంటిదని చెప్పాలి.

దీనిలో చెప్పన అనేక విషయాలు, జరిగిన సంఘటనలు అన్ని కూడా ఈ భూమిపై నివసిస్తున్న ఉన్న ప్రతి మానవుడికి స్ఫూర్తిదాయకం.

తండ్రిపై గౌరవం, అన్నదమ్ముల అనుబంధం, స్నేహం, భార్య ప్రేమ ఎలా ఉండాలి ఇలా ఇన్నో విషయాలను నిరూపిస్తుంది.

ఇదిలా ఉంటె ఇప్పుడు సీతదేవి స్వయంవరం ఘట్టంలో శ్రీరామచంద్రుడు విరిచిన విల్లు గురించి మనం తెలుసుకుందాం.

శ్రీరాముడు విశ్వామిత్రుడు యాగాన్ని రాక్షసుల నుంచి రక్షించిన తర్వాత అక్కడ నుంచి మిథిలాకి చేరుకున్నారు.

మిథిలాలో జరిగిన స్వయంవరంలో శ్రీరామచంద్రమూర్తి విల్లును విరిచి సీతను భార్యగా వలచాడు. అయితే ఆ విల్లు పేరు ఏంటో తెలుసా.?

ఇదేం ప్రశ్న రాముడు విరిచింది శివ ధనుస్సు కదా అని అనుకుంటున్నారా.? కానీ దీని పేరు శివ ధనుస్సు కాదు మరో పేరు ఉంది.

త్రిపుర నాశనం కోసం శివుడు ఉపయోగించే ఆయుధం కాబట్టి దీన్ని శివువి ధనుస్సు అంటారు. అయితే దీని అసలు పేరు పినాక.