ఏడు కొండల స్వామిని చేరడానికి ఏడు నడక మార్గాలు.. అవి ఏమిటంటే 

20 December 2024

Pic credit - Social Media

TV9 Telugu

అత్యధికంగా భక్తులు నడిచి వచ్చే మార్గం అలిపిరి. తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ల నుంచి టీటీడీ ఉచిత బస్సులను అలిపిరి వరకు నడుపుతోంది. కొంత మెట్ల మార్గం, కొంత నడక దారి ఉంది. మొత్తం 3650 మెట్లు. 

అలిపిరి నడకదారి 

శ్రీవారి మెట్టు అన్ని నడక మార్గాల్లోకి ప్రాచీనమైనది. వెంకటేశ్వర స్వామి ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారని ప్రతీతి.  అలిపిరి మార్గంతో పోలిస్తే మెట్ల సంఖ్య, దూరం తక్కువ.

శ్రీవారి మెట్టు

కుక్కలదొడ్డి శ్రీవారి పార్వేట మండపం దారి. తుంబుర తీర్థం చేరుకొని అక్కడ నుంచి పాపవినాశనం మీదుగా స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవచ్చు. పదకవితాపితామహుడు అన్నమయ్య ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారు.

కుక్కలదొడ్డి

శ్రీవారి ఆలయానికి చేరుకోవడానికి మరో నడక మార్గం.. శ్యామలకోన. కల్యాణి డ్యాం నుంచి కొన్ని కిలోమీటర్లు నడిచి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది.

శ్యామలకోన

రేణిగుంట నుంచి కడప తిరుపతి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం దగ్గర లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

అవ్వచారి కోన దారి 

తలకోన నుంచి కూడా తిరుమల కొండకు చేరుకోవచ్చు. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కనుకనే దీనికి తలకోన అని పేరు వచ్చింది. జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేటు దారి నుంచి తిరుమల చేరుకోవాలి. 

తలకోన 

శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉన్న నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం నుంచి వచ్చే యాత్రికులకు ఈ దారి అనుకూలంగా ఉండేది. విజయనగర రాజులు ఈ దారిలో రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

మామండూరు దారి