గణపతి నిమజ్జన సమయంలో ఈ తప్పులు అస్సలు వద్దు.. 

17 September 2024

Battula Prudvi 

వినాయక చవితి సందర్భంగా నవరాత్రి వేడుకలు నిర్వహించిన తర్వాత గణపతి నిమజ్జనం సమయంలో ఇలాంటి పొరపాట్లను అస్సలు చేయొద్దు.

గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వినాయకుడికి సంబంధించిన వస్తువులను విసిరేయకూడదు.

నవరాత్రి తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు వినాయకుడిని బోర్లా(వెనుక వైపు) నుంచి నీటిలో ముంచకూడదు.

కేవలం ముందుభాగం నుంచి మాత్రమే నీటిలో నిమజ్జనం చేయాలి. ఇలా చేస్తేనే ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

గణపతి నిమజ్జనం కోసం మీరు నీటిలో దిగేటప్పుడు అప్పటికే నిమజ్జనం చేసి కింద ఉన్న విగ్రహాలను కాళ్లతో తొక్కకుండా జాగ్రత్త పడాలి.

గణేష్ మండపంలో వినాయక విగ్రహాన్ని కదిలించడానికి ముందుగా పూజ చేసి పూలు, పండ్లు, కొత్త బట్టలు, మోదక లడ్డూలను బొజ్జ గణపయ్య ముందు ఉంచాలి.

అనంతరం హారతి ఇచ్చి, నైవేద్యాన్ని పంచిపెటట్టి తెల్లని గుడ్డలో ఐదు రకాల పండ్లు, పువ్వులు, మోదకం, తమలపాకులు కట్టి గణేశుని దగ్గర ఉంచాలి.

ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేస్తూ నవరాత్రుల వేళ తాము ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించమని కోరుకోని ఐదు లేదా 9 సార్లు గుంజిళ్లు తీయాలి.