24 February 2024
TV9 Telugu
Pic credit - Pexels
జైనమతంలో ఇతర మతాలకు భిన్నమైన అనేక పద్ధతులు ఉన్నాయి. జైనమతం శ్వేతాంబర, దిగంబర అనే రెండు పద్ధతుల్లో విభజించారు. ఈ పద్ధతులు రెండు వర్గాలవారు భక్తితో పాటిస్తారు.
తెల్లని బట్టలు ధరిస్తే శ్వేతాంబరులు, శరీరంపై ఎటువంటి దుస్తులు ధరించకపోతే దిగంబరులు. ఈ మతానికి చెందిన సాధువులు, సన్యాసినిలు జీవితంలో స్నానం చేయరు
జైన సన్యాసులు, సన్యాసినులు ఏ సీజన్‌లోనూ స్నానం చేయరు. అయితే దీనిని కూడా వారు పవిత్రంగా భావిస్తారు. ఈ సంప్రదాయం ఏమిటో తెలుసుకుందాం..
ఎంత చలి, వేడి ఉన్నా జైన సన్యాసులు స్నానం చేయరు. తమ శరీరాన్ని తడి గుడ్డతో తుడుచుకుంటారు. ఇలా చేయడం వలన స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుందని విశ్వాసం
జైన మతం భావజాలం ఏమిటంటే శారీరక స్వచ్ఛత కంటే మానసిక స్వచ్ఛత చాలా ముఖ్యమైనది అందుకే జైన సన్యాసులు స్నానం చేయడం అవసరం అని భావించరు.
మనసు స్వచ్ఛతను కాపాడుకోవడం చాలా ముఖ్యం అని నమ్మకం. మనస్సులో స్వచ్ఛమైన, ధర్మబద్ధమైన ఆలోచనలు శరీరాన్ని పవిత్రంగా చేస్తాయి. కనుక స్నానం అవసరం లేదని విశ్వాసం
జైన సాధువులు చలిగానీ, వేడిగానీ ఎప్పుడూ నేలపైనే పడుకుంటారు. అది కూడా ఎలాంటి పరుపు వేసుకోరు. రోజులో ఒక్కసారే ఆహారం తీసుకుంటారు.