అయోధ్యలో 100 మందితో ప్రత్యక సేవ..
TV9 Telugu
26 January 2024
ఇటీవల జనవరి 22న అత్యంత వైభవంగా అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా అయోధ్యలో 100 మంది కళాకారులతో 45 రోజుల పాటు బాల రాముడికి ‘రాగ సేవ’ భక్తి సంగీత ఉత్సవం జరగనుంది.
జనవరి 26న (శుక్రవారం) నుంచి రామ మందిరంలో ప్రారంబమైన ఈ సంగీత కార్యక్రమం మార్చి 10వ తేదీ వరకు కొనసాగుతుంది.
దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు.. రాముడి పాదాల చెంత ‘రాగ సేవ’ అందిస్తారు.
హేమామాలిని, అనూప్ జలోటా, అనురాధ పౌడ్వాల్, మాలిని అవస్థీ, సోనాల్ మాన్‌సింగ్, సురేశ్ వాడ్కర్, పద్మా సుబ్రహ్మణ్యం ఇందులో పాల్గొంటారు.
తొలిరోజే 5 లక్షల మందికి పైగా బాల రామయ్యని దర్శించుకోగా.. రూ.3.17 కోట్ల విరాళాలు లభించినట్లు వెల్లడించారు.
రెండవ రోజు బుధవారం రాత్రి 10 గంటల వరకు 2.5 లక్షల మందికి పైగా భక్తులు ఆడియోధ్య రామయ్య దర్శనానికి వచ్చారని తెలిపారు.
పెద్దఎత్తున భక్తులు అయోధ్యకు పోటెత్తడంతో మార్చి వరకు అయోధ్యను సందర్శించవద్దని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి