13 November 2024
Pic credit - Getty
TV9 Telugu
భారతదేశంలో చిన్నవి, పెద్దవి కలిపి 200 కంటే ఎక్కువ నదులు ఉన్నాయి. హిందూ మతంలో నదులను దేవతలుగా పూజిస్తారు. నదీస్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని అంటారు.
అయితే దేశంలో ప్రజలు ముట్టుకోవడానికి భయపడే నది ఉందని మీకు తెలుసా. ప్రజలు ఈ నదిని అపవిత్రమైన నదిగా భావిస్తారు.
ఈ నది పేరు కర్మనాశ. ఈ నది బీహార్‌లోని కైమూర్ జిల్లాలో పుట్టి ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర, చందౌలీ, వారణాసి, ఘాజీపూర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది.
ఈ నది శాపగ్రస్తమైందని అంటారు. అటువంటి పరిస్థితిలో ఈ నది నీటిలో స్నానం చేయడం వల్ల లేదా ఈ నది నీటిని ఉపయోగించడం వల్ల పుణ్యం నశిస్తుందని ఓ నమ్మకం.
త్రిశంకుడు అనే రాజు స్వర్గంలో అడుగు పెట్టడానికి దేవతలు నిరాకరించారు. దీంతో అతను స్వర్గం,భూమి మధ్య తలక్రిందులుగా వేలాడుతూ చిక్కుకున్నాడు.
త్రిశంకుడు తలకిందులుగా అనేక సంవత్సరాలున్నాడు. ఈ సమయంలో అతని నోటి నుంచి లాలాజలం భూమిపై పడింది. ఈ లాలాజలం నది రూపంలో ప్రవహించింది. అలా కర్మనాశ నది పుట్టింది.
ఈ నది నీటిని తాకడం వల్ల పాపం చుట్టుకుంటుందని నమ్ముతారు. ఈ నది పొడవు దాదాపు 192 కిలోమీటర్లు. ఈ నది 116 కి.మీ మేర యుపిలో ఉంది.
కర్మనాశ నది ఒడ్డున నివసించే ప్రజలు దాని నీటితో ఆహారాన్ని వండకుండా.. పండ్లు తిని జీవించేవారని చెబుతారు.