బాలుడిని అయోధ్య బాలరాముడిలా మార్చేసిన దంపతులు!

TV9 Telugu

21 March 2024

జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రతిష్టించనప్పటినుంచి రామ భక్తిలు ఎన్నో విధాలుగా అయోధ్య రమ్మయ్య తమ భక్తిని చాటుకుంటున్నారు.

అయోధ్య రామయ్యపై ఉన్న ప్రేమ, భక్తితో ఆర్టిస్ట్‌లైన దంపతులు 9 ఏళ్ల బాలుడిని అచ్చం రామ్ లల్లా గా మార్చేశారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందని ఆశిష్‌ కుందు అతని భార్య రూడి మేకప్‌ ఆర్టిస్ట్‌లు. ఆశిష్ ఒక రోజు అనుకోకుండా 9 ఏళ్ల అబీర్‌ దే ను చూశాడు.

వెంటనే అబీర్ కుటుంబాన్ని కలిసి తమ రామ్‌లల్లా కోరికను వారికి వివరించాడు. అందుకు వాళ్లుకూడా ఒప్పుకున్నారు.

పగటిపూట మేకప్ స్టూడియో నిర్వహించే ఈ ఆర్టిస్ట్ దంపతులు రాత్రివేళ బాలుడిని రాముడిగా మార్చడంపై వ్యూహాలు సిద్ధం చేశారు.

ఆభరణాల బరువుతో బాలుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తేలికైన ఫోమ్‌తో రామ్‌ లల్లా ధరించిన నగలను రూపొందించారు.

రామ్‌లల్లాగా మారిన బాలుడు.. పొరపాటున కాదు.. ఎలా చూసినా ఆ బాలుడు అచ్చం అయోధ్య బాల రామయ్యలానే కనిపించాడు.

స్థానికులు ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోయారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆశిష్-రూడి దంపతులు ఫేమస్ అయిపోయారు.