ద్వాదశ జ్యోతిర్లింగాల సరైన క్రమం ఇదే..
TV9 Telugu
10 July 2024
భారతదేశంలోని జ్యోతిర్లింగ దేవాలయాలలో సోమనాథ్ మొదటి జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ లోని వెరావల్ (సోమ్‌నాథ్)లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇది రెండవది.
క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలలో అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగం.
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున శివపురి అనే ఓం ఆకారంలో ఉన్న ద్వీపంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది.
వైద్యనాథ్ ధామ్ లేదా బాబా బైద్యనాథ్ ఆలయం అత్యంత ప్రసిద్ధ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఉంది.
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం, 12 జ్యోతిర్లింగాలలో భీమశంకర్ ఆరవ జ్యోతిర్లింగం. మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉంది.
12 జ్యోతిర్లింగాల క్రమంలో రామేశ్వరం 7వ స్థానంలో ఉంది. రామేశ్వరం ఆలయం తమిళనాడులోని పాంబన్ ద్వీపంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో ఉంది.
గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో గోమతి ద్వారక, బెట్ ద్వారక మధ్యలో ఉన్న్స్ నాగేశ్వర్ అత్యంత ప్రసిద్ధ జ్యోతిర్లింగ దేవాలయాలలో ఒకటి.
జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథ్ చాలా ముఖ్యమైనది. సర్వేశ్వరుని అనుగ్రహం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
నాసిక్‌లోని గోదావరి నది ఒడ్డున ఉంది త్రయంబకేశ్వర్. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరిగే నాలుగు హిందూ నగరాలలో ఒకటి.
ఉత్తరాఖండ్‌లోని మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్‌నాథ్ అన్ని జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది.
ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కరుణకు అధిపతిగా పేర్కొంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఇది చివరి జ్యోతిర్లింగం. ఇది ఎల్లోరాలో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి