09 September 2023

సెప్టెంబర్ 10 నుంచి 16, 2023 వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..!

మేషం

ఈ వారంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదంలో రాజీ కుదిరే అవకాశముంది. మీ బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్‌కి అవకాశం ఉంది. 

వృషభం 

ఈ వారం ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం

ఈ రాశివారికి ఈ వారమంతా అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులు ఉండదు. సమాజంలో మీకు గుర్తింపు పెరిగే అవకాశముంది. ఉద్యోగులకు మెరుగైన కొత్త అవకాశాలు లభిస్తాయి. 

కర్కాటకం

ఈ రాశికి చెందిన వారికి ఈ వారం వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యోగాలలో పై అధికారుల దగ్గర మీ ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త వ్యాపార ప్రయత్నాల్లో పురోగతి ఏర్పడుతుంది.  ప్రధాన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.  నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం

ఇంట్లో శుభ కార్యం జరిపేందుకు ప్రణాళికలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వాహన ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి.

కన్య

ఈ వారం ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రభుత్వపరంగా కూడా ఇబ్బందులు రావొచ్చు. గతంలో సహాయ సహకారాలు పొందిన స్నేహితులు కొందరు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశముంది. 

తుల

ఈ వారం అనేక విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. నలుగురిలో మీ గుర్తింపు పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలున్నాయి. 

తువృశ్చికంల

కొన్ని పనుల్లో ఆలస్యం జరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని వాయిదా పడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చు.

ధనుస్సు

ఈ వారం ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణబారం నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. 

మకరం

ఉద్యోగం మారే ప్రయత్నాలను ప్రస్తుతానికి విరమించుకోవడం మంచిది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే అభివృద్ధి, పురోగతి లభిస్తుంది. కుటుంబ సమస్యల పరిష్కారంల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పిల్లల కారణంగా కొన్ని సమస్యలు రావొచ్చు. 

కుంభం

కుటుంబ విషయాల్లో కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సోదరులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకండి. ఎవరికీ మీరు హామీలు ఉండకండి. విద్యార్థులు శ్రద్ధను, శ్రమను పెంచాల్సి ఉంటుంది. 

మీనం

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు, ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు వస్తాయి. కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.