20 August 2023

వారఫలాలు.. ఆగస్టు 20 నుంచి 26 వరకు

మేషం: ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. శుభ వార్తలు వింటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది.

వృషభం: బుధ, రవి గ్రహాలు ఉద్యోగపరంగా మంచి అదృష్టాన్ని సూచిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. 

మిథునం: వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. గతకొంత కాలంగా ఉన్న వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

కర్కాటకం: కుజ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. 

సింహం: వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్రయత్నంగా వివాహ సంబంధం కుదిరే సూచనలున్నాయి.

కన్య: లాభ స్థానంలో ఉన్న శుక్ర గ్రహం వల్ల ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగి పోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. 

తుల: శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. 

వృశ్చికం: రవి, కుజులు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాలు ఉండవు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు.

ధనుస్సు: శనీశ్వరుడు, రాశినాథుడైన గురువు, బుధ, రవులు అనుకూలంగా ఉన్న కారణంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. 

మకరం: శుక్రుడు, శనీశ్వరుడు అనుకూలంగా ఉండడంతో ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. 

కుంభం: ఈ రాశివారికి ప్రస్తుతం అనుకూలంగా ఉన్న బుధుడు వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఇస్తాడు. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆహార విహారాలు, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

మీనం: వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాల్లో అనుకోకుండా లాభాలు పెరుగుతాయి.