కన్య రాశి వారు ఎక్కువగా కష్టపడుతారు. భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. క్రమబద్ధమైన జీవన శైలిని కలిగి ఉంటారు.
కన్య రాశి వ్యక్తులు వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు. ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంటారు. ఏ పనిలోనైనా పరిపూర్ణత సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకమని వారు నమ్ముతారు.
తమ లోపాలను కూడా తెలుసుకుంటారు. ఈ రాశివారు ఒక్కోసారి అహంకారులుగా అనిపిస్తారు. స్పష్టమైన భావనలను ఇష్టపడతారు.
కన్య రాశి వారు స్నేహితులుగా అందరికి సహాయం చేస్తారు. అందరి సమస్యలను పరిష్కరిస్తారు. అంతేకాదు స్నేహితుడి మాటలు వినడానికి ఎల్లప్పుడు సిద్దంగా ఉంటారు.
గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు. ప్రేమ విషయానికి వస్తే.. తటస్థంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఏమికావాలో వారికే తెలుసు. ఎవ్వరితో రాజీపడరు.
తన విలువని తగ్గించుకోవడానికి ఇష్టపడరు. నిబద్ధతతో కూడిన సంబంధాన్ని కోరుకుంటారు తీవ్రమైన అంకితమైన భాగస్వాములను ఇష్టపడుతారు.
ప్రేమికులుగా కన్యారాశి వారు చాలా సరదాగా ఉంటారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో వారికి తెలుసు అందుకే జీవిత భాగస్వామితో కలిసి కొత్త సాహసాలకు సిద్ధంగా ఉంటారు.