చాణక్యనీతి : ఇతర స్త్రీపై కన్నుపడితే.. పురుషుడి గతి ఇదే!

Samatha

29 August  2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు. అనేక విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని  రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఎన్నో విషయాలను అందజేశారు.

ముఖ్యంగా బంధాలు, బంధుత్వాలు, మనీ సక్సెస్, ఓటమి, జీవితంలోని పాఠాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, విద్య, ఉద్యోగం ఇలా ఎన్నింటి గురించో వివరించారు.

అలాగే చాణక్యుడు స్త్రీ పరుషుల గురించి కూడా చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా స్త్రీ, పురుషుల సంబంధం గురించి గొప్పగా చెప్పారు.

అలాగే ఆయన పురుషుడు వేరొక స్త్రీని చూడటం వలన కలిగే పరిణామాలు, అలాంటి వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల గురించి తెలిపారు.

ఒక వ్యక్తి వేరొక స్త్రీని చూడటం వలన తమ కుటుంబ ప్రతిష్ట కోల్పోవడమే కాకుండా, తరచుగా అవమానానికి గురి కావాల్సి వస్తుందంట.

అలాగే, ఇలాంటి వారికి జీవితంలో ఎప్పుడూ గౌరవం లభించదంట, ఇది సంపదను, గౌరవాన్ని లాక్కుంటుందని చెబుతున్నాడు చాణక్యుడు.

అదే విధంగా, చాణక్య నీతి ప్రకారం మీ తప్పుడు కోరికలు, మీ తెలివితేటలను , జ్ఞానాన్ని నాశనం చేస్తాయి. ఇవి మీ కెరీర్ ను నాశనం చేస్తాయంట.