16 November 2023
ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది
హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలో ఉన్న ఆలయం పేరు బిజిలి మహాదేవ్ మందిరం. సైన్స్ కు అందని మిస్టరీ..
ఆ పిడుగు శివలింగంపై పడి శివలింగాన్ని తునాతునకలు చేస్తుంది. ఆ శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి
పిడుగు పడినా మందిరం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు. మర్నాడు గుడికి వెళ్లిన పూజరి ముక్కలను ఒక్కచోటికి చేర్చి శివయ్యకు అభిషేకం చేస్తారు.
ఒక్కరోజులో లింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. దీన్ని వింత అనాలో, శివలీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది.
ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడానికి కష్టపడాల్సిందే. కొండపై సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది.
పర్వతంపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అదృష్ఠవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట.
భోళాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ.