₹151 చెల్లిస్తే.. మీ ఇంటికే రాములోరి కల్యాణ తలంబ్రాలు

TV9 Telugu

02 April 2024

ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారాముల కళ్యాణ వేడుకలు కోసం అలంకరణ సిద్ధం అవుతుంది.

శ్రీ సీతారామ కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనుంది.

గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.

ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి.

తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లు 040-23450033ను సంప్రదించాలి.

ఎంతో నిష్ఠతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు.

విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో 2022లో 89 వేల మందికి గతేడాది 1.17 లక్షల మందికి తలంబ్రాలను అందించింది టీఎస్‌ఆర్టీసీ.