15 December 2023
ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటుంది. కోట్లాది హిందువులు ఎదురుచూస్తున్న కోరికను తీరుస్తూ రామయ్య కొలువుదీరనున్నారు.
రామ్ లల్లాని జనవరి 22 వ తేదీన ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ప్రముఖులు, స్వామీజీలు, భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
అయోధ్యకు వచ్చే భక్తుల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అని సౌకర్యాలను కల్పిస్తుంది. రవాణా, వసతి సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేస్తోంది.
అయోధ్యకు రవాణా సౌకర్యంలో భాగంగా ఎయిర్ పోర్ట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దాదాపు శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయింది.
ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఈ నెల 25 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా అయోధ్యలోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు
బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ , అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసును ప్రారంభించనున్నారు.
వచ్చే ఏడాది జనవరి 6వతేదీన అయోధ్య నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు, జనవరి 11న అహ్మదాబాద్ నుండి అయోధ్యకు మొదటి విమానంలో బయలుదేరుతుంది