రామమందిరం ప్రారంభోత్సవం వేళ.. ఆలయ విశేషాలు మీకోసం 

04 January 2024

TV9 Telugu

రామమందిర ప్రారంభోత్సవానికి కొద్దిరోజులు మిగిలి ఉంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏనుగు, సింహం, హనుమంతుడు, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ఆలయ ప్రవేశ ద్వారం

ఈ విగ్రహాలు రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ గ్రామం నుండి సేకరించిన పింక్ ఇసుకరాయితో అందంగా తయారు చేశారు

గులాబీ రాళ్లు 

రామ మందిరం సాంప్రదాయ నాగర్ శిల్పి శైలిలో నిర్మితమైంది. ఈ ఆలయం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.

నాగర్ శిల్ప శైలి 

ఆలయంలో మూడు అంతస్తులు ఉంటాయి, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయానికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉంటాయి. 

మూడు అంతస్తులు

ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) కోలువదీర నుంది.  మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది.

రామ్ లల్లా 

ఆలయంలో ఐదు మండపాలు ఉండనున్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఉన్నాయి. మందిర స్తంభాలు, గోడలను దేవతల విగ్రహాలతో అలంకరించారు.

ఐదు మండపాలు  

ఆలయానికి వచ్చే భక్తులు తూర్పు వైపు సింహ ద్వారం నుంచి ప్రవేశించి 32 మెట్ల ఎక్కి గుడి లోపలకు వెళ్లాలి.  వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు, లిఫ్టుల సౌకర్యం ఉంది. 

 ఎలా ప్రవేశించాలంటే 

 శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో,  వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరీ మాత, దేవి అహల్య మందిరాలున్నాయి

 ఇతర ఆలయాలు 

ఈ ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ , ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రారంభించనున్నారు. దీనికి ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. 

ఆహ్వానాలు