25 December 2023
అయోధ్యలో రామయాల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్య ప్రవేశద్వారం వద్ద 'సూర్యుని ఏడు గుర్రాలు' భక్తులకు స్వాగతం పలకడానికి రెడీ అవుతోంది.
శ్రీ రాముడు సూర్యవంశస్థుడు. సూర్యవంశానికి సంబంధించిన చిహ్నం ఎదుగుర్రాల రథం మీద పయనించే సూర్యుడు. ఏ వ్యక్తి అయినా అయోధ్యలో అడుగుపెట్టగానే ముందుగా చూసేది సూర్యుడితో పాటు గుర్రాల విగ్రహాలే.
రామయ్య జన్మభూమి అయోధ్యలో ధర్మ మార్గంలో భారీ గేటు నిర్మిస్తున్నారు. ఈ ద్వారం వద్ద ఏడు గుర్రాల విగ్రహాలను ఏర్పాటు చేస్తారు.
ఎఫ్‌ఆర్‌పీ టెక్నాలజీతో విగ్రహాలను సిద్ధం చేస్తున్నామని హస్తకళాకారుడు హేమంత్ తెలిపారు. ఈ సాంకేతికత ప్రకారం, విగ్రహాల తయారీకి ప్రత్యేకమైన మట్టిని ఉపయోగిస్తారు. వివిధ రసాయనాలను కలిపి తాయారు చేస్తారు.
ఈ విగ్రహాలు ఎనిమిది మీటర్ల ఎత్తు మరియు తొమ్మిది మీటర్ల వెడల్పుతో ఉంటాయి. దీంతో ఆలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తాయి.
విగ్రహాల తయారీలో తనకు ఎదురైన అతిపెద్ద సవాలు వాతావరణానికి సంబంధించినదని హస్తకళాకారుడు హేమంత్ చెప్పాడు. వాతారణం చల్లగా ఉంటుంది. కనుక విగ్రహాలు ఎండడానికి సమయం పడుతుంది.
ప్రస్తుతం ఈ గుర్రాల విగ్రహాలకు తెలుపు రంగును వేశారు. తర్వాత ఈ విగ్రహాలు మరింత అందంగా కనిపించేలా రంగురంగులను అద్దనున్నారు.