బాల రామయ్య విగ్రహ ప్రత్యేకలు ఏమిటంటే 

19 January 2024

TV9 Telugu

అరుణ్ యోగిరాజ్ చేత చెక్కబడిన 51 అంగుళాల పొడవైన బాల రాముడి విగ్రహాన్ని పూజ మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించారు.

గర్భ గుడిలో 

అనిల్ మిశ్రా, చంపత్ రాయ్, స్వామి గోవింద్ గిరితో సహా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల మధ్య ఈ  వేడుక కన్నుల పండుగగా జరిగింది .

ఎవరు హాజరయ్యారంటే 

విగ్రహం 200 కిలోల బరువు. గర్భగుడిలోని స్థలం. రామయ్య విగ్రహం ప్రతిష్టించే పీఠం పరిమితంగా ఉన్నందున ఇంజనీర్ల బృందం పర్యవేక్షణలో విగ్రహం ప్రతిష్ట 

సహకరించిన ఇంజినీరింగ్ బృందం 

విగ్రహం "జలాధివాస్" ఆచారంలో భాగంగా విగ్రహం మొదట తడి గుడ్డతో కప్పబడి, ఆపై "గంధాధివాస్" ఆచారంలో భాగంగా చందనం, కేసర్‌తో చేసిన ప్రత్యేక పేస్ట్‌తో కప్పబడి ఉంటుంది.

జలధివాస్ కర్మ

పాత విగ్రహాని కూడా గర్భ గుడిలో ప్రతిష్టించడానికి ఆచారాలు ప్రారంభమయ్యాయి. ఈ విగ్రహాన్ని ఉత్సవ  విగ్రహంగా చెబుతున్నారు. 

పాత విగ్రహానికి కూడా పూజలు 

విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం గర్భగుడిని శుభ్రం చేసి పరదా కప్పారు. గర్భ గుడిలోకి పూజ చేసే పూజారికి  మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంటుంది. 

పరదా కప్పి ఉంది

ఈ నెల 22న జరగనున్న శంకుస్థాపన సందర్భంగా మండపం "హవానం" (యజ్ఞం యాగాల) కోసం సర్వం సిద్ధమైంది. కేంద్రం జనవరి 22న హాఫ్ డే ప్రకటించింది.

మండపం ఏర్పాటు  

శుక్రవారం ప్రారంభమైన హవాన్ ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. యజ్ఞ కుండంలోని అగ్నితో పాటు..  ఆలయంలోని తొమ్మిది మూలల్లోని 'తొమ్మిది కుండలు' నిరంతరం వెలుగుతుంటాయి.

జనవరి 22 వరకు కొనసాగనున్న హవనం