గురు పౌర్ణమికి మంత్రాలయం వెళ్తున్నారా.? చూడాల్సినవి ఇవే.. 

06 July 2025

Prudvi Battula 

మంత్రాలయం వెళ్ళగానే ముందుగా పంచె కట్టుకొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శానికి వెళ్ళాలి. ఆడవాళ్లు కూడా సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వెళ్ళాలి.

మంత్రాలయం ప్రవేశద్వారం వద్ద అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అంతేకాదు, గురు రాయల పాదుకలు తిమ్మన్నాచార్యుల ఇంట్లో భద్రంగా ఉంచబడ్డాయి.

వీటి తర్వాత మంత్రాలయం పక్కనే మంచాలమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దేవతకి దీపం అర్పిస్తే అనుకొన్నది జారుతుందని నమ్మకం.

మంత్రాలయం నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బిచ్చాలే గ్రామం, శ్రీ అప్పన్నాచార్యులకు సంబంధించిన ప్రదేశం. ఇక్కడ ఏకశిల వృందావనం ఉంది.

ఇంకొక ముఖ్యమైన ప్రదేశం గాణదాల గ్రామంలోని పంచముఖి ఆంజనేయాలయం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెబుతారు.

హైదరాబాద్ నుంచి మంత్రాలయం చేరుకోవడానికి ప్రభుత్వం నడుపుతున్న డైరెక్ట్ బస్సుల ద్వారా లేదు మీ సొంత వాహనంలో వెళ్ళవచ్చు.

హైదరాబాద్ నుండి కర్నూలుకు వెళ్లి కూడా మంత్రాలయం చేరుకోవచ్చు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం బస్ స్టేషన్ నుంచి కొద్ది దూరంలోనే ఉంది. నడిచి కూడా వెళ్ళవచ్చు.

ఇంకా మీకు టైం ఉంటె అక్కడినుంచి 145 కి.మీ. దూరంలోనే ఉన్న యాగంటి కూడా వెళ్లి ముక్కంటి దర్శనం చేసుకొని రావచ్చు.