పురాణాల ప్రకారం.. ఏ రోజు ఏ రంగుచీర కడితే మంచిదో తెలుసా.?
05 July 2025
Prudvi Battula
చీర ధరించడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒకటి. చీర కట్టిన స్త్రీ అందరిలోనూ అందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది.
సోమవారం: తెలుపు రంగు స్వచ్ఛత, శాంతితో ముడిపడి ఉంటుంది. సోమవారం తెల్లపు చీర కట్టుకుంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మంగళవారం: ఎరుపు రంగు అంగారక గ్రహంతో ముడిపడి ఉంటుంది. ఇది శక్తిని సూచిస్తుంది. మంగళవారం ఎరుపు రంగు చీర ధరిస్తే అన్ని శుభాలే.
బుధవారం: బుధవారం రోజున మీ నచ్చిన శైలిలో ఆకుపచ్చ రంగు చీరను ధరించడం వల్ల పెరుగుదల, సామరస్యాన్ని సూచిస్తుంది.
గురువారం: ఈ రోజున పసుపు రంగు ధరించడం వల్ల బృహస్పతి అనుగ్రహం లబిస్తుంది. ఇది సానుకూలతతో ముడిపడి ఉంటుంది.
శుక్రవారం: గులాబీ లేదా లేత నీలం రంగు చీర ధరించడం అనుకూలంగా ఉంటుంది. ఈ రంగులు అందం, ప్రశాంతతను సూచిస్తాయి.
శనివారం: శనివారం రోజు నలుపు లేదా ముదురు నీలం రంగు చీరను కట్టుకోవడం క్రమశిక్షణ, రక్షణను సూచిస్తుంది.
ఆదివారం: నారింజ రంగు సూర్యునికి, తేజస్సుకు సంబంధించినది. ఆదివారం ఈ రంగు చీర ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో మీకు తెలుసా?
అంతరిక్షంలో అత్యధిక సాటిలైట్లను కలిగిన దేశాలు ఇవే..
పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.?