గణపతి నవరాత్రి రెండో రోజు తెలుసుకోవాల్సిన కథ ఇదే..
07 September 2024
Battula Prudvi
శివ పార్వతుల వివాహనికి సాయం చేయదలచి పరమశివుడి కోపానికి గురైన మన్మథుడు అగ్నికి ఆహుతి అయినా వృతాంతం చాలామందికి తెలిసిందే.
అలా కాముణ్ని భస్మం చేయగా సముద్రంలో పడిన మిగిలిన ఆదిదేవుని రుద్రనేత్రాగ్ని నుంచి పుట్టినవాడే జలంధరుడు.
దీంతో శివుడి వల్ల తప్ప వేరొకరి చేత అతనికి మరణం లభించదు. కాలనేమి తన పుత్రిక బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేశాడు.
వారిద్దరికీ ఓక కామాసురుడు అనే కుమారు కుమారుడు జన్మిస్తాడు. అతను లోకకంటకుడు మహిషాసురుని కుమార్తె తృష్ణను పెళ్లాడాడు.
ఆ అసురుడు పరమశివుడి కోసం భీకరమైన తపస్సు చేసి అజేయత్వం, నిర్భయత్వం, మృత్యుంజయత్వమనే వరాలను పొందుతాడు.
ఆతను మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభించగా లోకమంతా కామాధీనమయింది. దేవతలు, మునులు ముద్గల మహర్షిని సూచనతో వికట వినాయకుడిని పూజించి అభయం పొందారు.
తాను చెరబట్టిన చిత్రాంగిని రక్షించాడని గణపతిపై కక్షగట్టిన మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదికి కామాసురుని పురిగొల్పాడు.
కామాసురుడు మయూర రూపం ధరించి, గణపతిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించగా.. ఆ మయూరాన్ని అణచివేసి దానిని అధిరోహించాడు గణేశుడు.
నెమలిపై విహరిస్తున్న వినాయకుడిని చూసి దేవతలు, మునులు, ‘మయూరవాహనా! వికట వినాయకా!’ అని స్తుతించి అటుకులు నివేదించి స్వామిని తృప్తి పరిచారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి