400 ఏళ్ల నాటి దేవాలయం.. 1001 రంధ్రాలతో శివలింగం..
13 April 2025
Prudvi Battula
మధ్యప్రదేశ్‌లోని రేవాలో ప్రపంచంలోని ఏకైక మహామృత్యుంజయ ఆలయం ఉంది. ఇది 400 సంవత్సరాల కంటే పురాతన ఆలయం.
ఈ ఆలయంలో మహామృత్యుజయ మంత్రాన్ని పఠించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని, అకాల మరణం నివారిస్తుందని నమ్మకం.
ఈ ఆలయ శివలింగ నిర్మాణం ఇతర శివలింగాల కంటే భిన్నంగా ఉంటుంది. 1001 రంధ్రాలతో ఉన్న శివలింగం ఉంది. ఇలాంటి లింగం ప్రపంచంలోని ఏ ఆలయంలోనూ కనిపించదు.
ఈ అద్భుతమైన ఆలయం రేవా కోట సముదాయంలో ఉంది. ఈ ఆలయంలో పూజలు చేయడం ద్వారా అకాల మృత్యువు నుంచి బయటపడవచ్చు.
మహారాజా విక్రమాదిత్య బాంధవ్‌ఘర్ నుంచి రేవాకు వేట కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఒక జింక సంచరించడం చూశాడు. అది మట్టిదిబ్బపై నిలబడి ఉంది.
సింహం జింక ముందు నిలబడి ఉంది. అయితే సింహం జింకను వేటాడలేదు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత విక్రమాదిత్యుడు ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపాడు.
ఆ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినప్పుడు దివ్యమైన మహామృత్యుంజయ శివలింగం ఉద్భవించింది. ఆ తర్వాతే శివలింగాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు.
ఆ శివలింగం లభించిన ప్రదేశంలో బాంధవ్‌ఘర్ మహారాజు విక్రమాదిత్య ఓ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ వస్తువులు ఇంట్లో ఉంటె అశుభం..
అర్ధరాత్రి పుట్టినరోజు జరుపుకోవచ్చ.?
అశ్వగంధ ఆ సమస్యలకు యమరాజు..