తవ్వకాల్లో 300 ఏళ్ల నాటి శంఖం లభ్యం.. నేటికీ ఓంకార నాదం.. 

15 February 2024

TV9 Telugu

ఉత్తర్ ప్రదేశ్ సహరాన్‌పూర్ జిల్లాలోని మండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఇది 35 సంవత్సరాలుగా మూసివేయబడింది. హిందూ సంస్థల డిమాండ్ మేరకు నిర్వహణ కోసం తెరవబడింది.

గోటేశ్వర్ మహాదేవ్ ఆలయం

ఇక్కడ ఉన్న బావిని త్రవ్వినప్పుడు, శివలింగం, నందీశ్వరుడు, గణపతి సహా ఇతర దేవతలు, దేవుళ్ల విగ్రహాల అవశేషాలు బయటపడటం ప్రారంభించాయి.

తవ్వకాల్లో దొరికిన శివలింగం

ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఎన్నో పురాతన విగ్రహాలు లభించినా అందరిని బాగా ఆకట్టుకుంది శంఖం. ఈ శంఖం దాదాపు 300 ఏళ్ల నాటిదని పురాతన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

300 ఏళ్ల నాటి శంఖం

ఈ శంఖం విశేషమేమిటంటే ఇప్పటికీ ఈ శంఖం నుంచి శబ్ధాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయన్ని బావి తవ్వేవాళ్ళు ధ్రువీకరించారు. శంఖాన్ని ఆడించి ప్రదర్శించారు.

శంఖం నుంచి శబ్దం 

సమాచారం ప్రకారం, గోటేశ్వర్ మహాదేవ్ ఆలయం మరాఠా కాలంలో నిర్మించారు. ఇది శతాబ్దాల నాటిదని గుర్తించారు. ఈ ఆలయ ప్రాంగణంలో బావి కూడా అప్పుడే ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. 

శతాబ్దాల నాటి బావి  

17 వ శతాబ్దంలో నిర్మించబడిన శతాబ్దాల నాటి ఈ దేవాలయం గురించి.. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ బావి గురించి తమ పూర్వీకులు ఎన్నో కథలు చెప్పేవారని పూజారి తెలిపారు.

ఎన్నో కథలు 

ఈ భారీ బావిని తవ్వినప్పుడు విలువైన విగ్రహాలు మాత్రమే కాదు.. బావి క్రింద నేలమాళిగకు దారితీసే మెట్లు ఉన్నాయి. బావిని శుభ్రపరిచే సమయంలో రహస్య బేస్మెంట్ తలుపులు కనిపించే అవకాశం ఉంది.

నేలమాళిగ