07 June 2024

తియ్యగా ఉందని.. చెరుకు రసం తాగుతున్నారా.? 

Narender.Vaitla

చెరుకు రసంలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. రోజుకు ఒక గ్లాసు కంటే ఎక్కువ చెరుకు రసాన్ని తీసుకుంటే ఊబకాయం, షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చెరుకు రసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొలికోసనాల్ నిద్రలేమికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.

ఇక చెరుకు రసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. మోతాదుకు మించి తీసుకుంటే లూజ్‌ మోషన్స్‌ అవుతాయని చెబుతున్నారు. 

చెరుకు రసంలో పోలికోసనాల్ ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. కాబట్టి రక్తాన్ని పలచబరిచే మందులు తీసుకునే వారు చెరుకు రసానికి దూరంగా ఉండడమే మంచిది.

దంత సమస్యలతో ఇబ్బందిపడేవారు చెరుకు రసాన్ని మితంగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని చక్కెర నోటి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుండొచ్చు.

చెరుకు రసంలో ఉండే పోలికోసనాల్ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది కడుపు నొప్పికి కారణమవుతుండొచ్చు.

నిత్యం జలుబు, దగ్గుతో ఇబ్బందిపడే వారు చెరకు రసాన్ని వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం