18 June 2024
TV9 Telugu
Pic credit - getty
ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన వేడిగా ఉంది. దీంతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉపశమనం కోసం ఎక్కువ సమయం ఎయిర్ కండిషన్డ్ గదుల్లో గడుపుతున్నారు.
ఆఫీసులో ఏసీ నిరంతరం ఆన్‌లో ఉంటుంది. ఈ ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో గంటల తరబడి కూర్చుని కుర్చుని.. నేరుగా బయటకు లేదా ఎండలోకి వెళ్తుంటారు కొందరు.
గంటల తరబడి శీతల ఉష్ణోగ్రతలో ఉండటం, నేరుగా ఎండ వేడిలో బయటకు వెళ్లడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నిపుణులు చెబుతున్న విషయాలు తెలుసుకుందాం
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దీపక్ సుమన్ ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఉక్కపోత ఎక్కువగా ఉందని చెప్పారు. దీంతో ఇంటిలో, ఆఫీసులో కూడా AC నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.
అటువంటి పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా 50 డిగ్రీల నుంచి 20 లు లేదా 25 డిగ్రీలకు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో మెదడు పనితీరు దెబ్బతింటుంది.
ఉష్ణోగ్రతలో ఇటువంటి ఆకస్మిక మార్పులకు మెదడు సర్దుబాటు అవదు. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. రక్తస్రావం జరుగుతుంది.
ఆక్సిజన్ అందక మెదడులోని నరాలు దెబ్బతింటాయి. మెదడులోని నరాలు పగిలిపోతాయి. ఒకొక్కసారి మెదడులో రక్తస్రావం జరగవచ్చు. సకాలంలో చికిత్స అందకపోతే మరణానికి కూడా దారి తీస్తుంది.