మంచిదని వేడి నీరు ఎక్కువగా తాగుతున్నారా.?

21 November 2023

వేడి నీటిని అధికంగా తాగడం వల్ల సిరల్లో వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్యానికి మంచిది కదా అని వేడి నీరు ఎక్కువ తాగితే మంచిది కాదు.

ఇక వేడి నీటిని ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి సమస్య కూడా వెంటాడుతుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మెదడు నరాలపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. 

వేడీ నీటిని తీసుకోవడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అయితే అధిక మొత్తం వేడి నీటిని తాగడం వల్ల మూత్ర పిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. 

ఇక కొన్ని సందర్భాల్లో వేడీ నీరు తాగడం వల్ల రక్త నాళాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది రక్తప్రసరణ పెరగడానికి కూడా కారణంగా మారుతుండొచ్చు. 

ఎక్కువ వేడి తాగడం వల్ల నోటిపూత సమస్య వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని నీరు అదికూడా తక్కు మొత్తంలోనే తీసుకోవాలి. 

వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణుల చెబుతున్నారు. అలాగే అన్నవాహికపై కూడా ప్రభావం పడుతుంది. 

అతిగా వేడి నీరు తాగితే శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుఉందని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే అందించినవి. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.