YSRCPలో న్యూ జెన్ పాలిటిక్స్‌కి తెర

TV9 Telugu

04 January 2024

YSRCP ప్రకటించిన 27 మంది జాబితాలో ఎట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి.. స్పెషల్ ఎట్రాక్షన్ మాత్రం ఆ ఫైవ్ యంగ్ స్టార్సే.

తండ్రులను పక్కకు పెట్టి.. తనయులకు ఛాన్స్ ఇచ్చిన వైసీపీ అధిష్టానం.. న్యూ జెన్ పాలిటిక్స్‌కి తెర తీసింది.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ తనయుడు అభినవ్ రెడ్డి.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డి.

తండ్రికి తగ్గ తనయులుగా రాజకీయాల్లో దూకుడును ప్రదర్శిస్తున్న భూమన అభినవ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గానికి సైతం రాజకీయ వారసుడొచ్చాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్య ప్రకాష్‌.

మాజీ మంత్రి పేర్ని నాని వారసుడి కోసం మచిలీపట్టణం సీటును త్యాగం చేశారు. పేర్ని క్రిష్ణమూర్తి అలియాస్ కిట్టు బందరు ఇన్‌చార్జిగా ఎంపికయ్యారు.

రాజకీయాల్లో దగ్గరుండి ఓనమాలు నేర్పించి, తనయుడ్ని తీర్చిదిద్దిన పేర్ని నాని... రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నారు.

గుంటూరు ఈస్ట్ నుంచి రెండుసార్లు గెలిచిన ముస్తఫా స్థానంలో ఆయన కూతురు నూరి ఫాతిమాకు అవకాశం ఇచ్చింది వైసీపీ.

ఒకే జాబితాలో ఐదు మంది వారసులకు అవకాశమిచ్చి.. కొత్త తరం రాజకీయాల్ని ప్రోత్సహించారు వైసీపీ అధినేత జగన్.