తెలుగు స్టేట్స్ సీఎంల జీతాలు ఎంతో తెలుసా ??

TV9 Telugu

21 June 2024

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగవసారి సీఎం అయ్యారు ప్రమాణ స్వీకారం చేశారన్న విషయం తెలిసిందే.

అలానే ఒడిశా లో తొలిసారి బీజేపీ తరఫున మోహన్ చరణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయం కూడా అందరికి తెలిసిందే.

అయితే రెండు రాష్ట్రాల్లో సీఎంలు నెలకు ఎంత జీతం తీసుకుంటారు అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. ఇప్పుడు వివరాలను చూసేద్దాం

అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన జీతం ముఖ్యమంత్రులకి ఉండదు. వాళ్ళ పరిస్థితిలో స్థితిగతుల్ని బట్టి మారుతూ ఉంటుంది.

ఒడిశా ముఖ్యమంత్రికి దాదాపు 1.60 లక్షల జీతం ఇస్తారు. ఏపీలో చూసినట్లయితే ముఖ్యమంత్రి జీతం నెలకు 3,35,000 గా ఉంది.

ఇది ఇలా ఉంటే.. త్రిపుర సీఎం కు దేశంలోనే అత్యల్ప జీతం పొందుతున్నారు. కేవలం 1.05 లక్షలు మాత్రమే వస్తాయి.

తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది ఇది కూడా కొత్త, చిన్న రాష్ట్రం. తెలంగాణ సీఎం దేశంలోనే అత్యధికంగా 4.10 లక్షల వేతనం నెలకి పొందుతున్నారు.