18వ లోక్‌సభ ప్రత్యేకతలు ఇవే!

TV9 Telugu

24 June 2024

పదేళ్ల తర్వాత బీజేపీకి మెజారిటీ రాలేదు.. అలాగే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది.

17వ లోక్‌సభలో 216 మంది ఎంపీలు మళ్లీ గెలిచారు. 280 మంది ఎంపీలు తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.

బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీకి అత్యధికంగా 11.75 లక్షల ఓట్లు వచ్చాయి. శివసేన అభ్యర్థి రవీంద్ర వయ్కర్ అతి తక్కవగా 48 ఓట్లతో గెలుపొందారు.

ఎస్పీకి చెందిన పుష్పేంద్ర సరోజ్ 25 ఏళ్లు అత్యంత పిన్న వయస్కుడు. డీఎంకేకు చెందిన టీఆర్‌ బాలు 83 ఏళ్లు అత్యంత వృద్ధ ఎంపీ. లోక్‌సభ ఎంపీల సగటు వయస్సు 56 ఏళ్లు.

టీడీపీకి చెందిన చంద్రశేఖర్ పెమ్మసాని అత్యంత సంపన్న ఎంపీ. 504 మంది ఎంపీలు లక్షాధికారులు, సగటు సంపద 46 కోట్లు.

ఇంజనీర్ రషీద్, అమృతపాల్ సింగ్ ఇద్దరూ జైలులో ఉండి ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు.

కాంగ్రెస్‌కు చెందిన కె. సురేష్ అత్యధికంగా 8 సార్లు గెలిచిన ఎంపీ. బీజేపీకి చెందిన భర్తిహరి మహతాబ్ వరుసగా గరిష్టంగా 7 సార్లు ఎంపీగా ఉన్నారు.

లోక్‌సభలో 41 పార్టీల ఎంపీలు విజయం సాధించారు. లోక్‌సభకి పోటీచేసిన మహిళల్లో 74 మంది మహిళా ఎంపీలు గెలుపొందారు.

పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాల నుంచి గెలిచిన ఏకైక ఎంపీ రాహుల్ గాంధీ. 170 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.