మీ ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ సేఫ్ గా ఉండాలంటే ఇవి పాటించండి
డబ్బు సంపాదించడం.. సంపాదించిన దానిలో కొంత భాగాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడం అందరూ చేస్తారు.
ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
ఇన్వెస్ట్మెంట్ రిస్క్ : ప్రతి ఇన్వెస్ట్మెంట్ కొంత స్థాయిలో రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేసేముందు తక్కువ రిస్క్ ఉన్నదానిని ఎంచుకోవాలి.
డైవర్సిఫికేషన్: రిస్క్ మేనేజ్ చేసుకోవాలంటే.. మనం మన డబ్బు మొత్తం ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు. రకరకాల ప్రాపర్టీస్, సెగ్మెంట్స్ లలో చేయాలి. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు.
టైం పిరియడ్: ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో టైం పిరియడ్ చాలా ముఖ్యం. తక్కువ కాలం పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్స్ ఆశించడం అంత సరైనది కాదు.
కనీసం ఐదేళ్ళు పెట్టుబడి పెట్టడం అనేది ఫలితాలను ఇస్తుంది. ఓపికగా ఉంటె ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రాబడి కూడా బాగానే ఉంటుంది.
క్రమశిక్షణ: ఎటువంటి పరిస్థితిలోనూ మీ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ వదలవద్దు. మార్కెట్ లో పరిస్థితి బాగోలేదని తొందర పడవద్దు. మీ ప్లాన్స్ నుంచి పక్కకు జరగొద్దు.
రీసెర్చ్: ఎదో కనిపించింది.. ఎవరో చెప్పారు.. అని పెట్టుబడులు పెట్టేయకూడదు. ఇన్వెస్ట్ చేసేముందు సంబంధిత ప్లాన్ విషయంలో రీసెర్చ్ చేయాలి.