అర్జెంట్ మనీ కోసం.. గోల్డ్ లోన్, పర్సనల్ లోన్? ఏది మంచిదో తెలుసా?
Samatha
29 August 2025
Credit: Instagram
డబ్బులు ఎవరికి అవసరం ఉండదు చెప్పండి. కొన్నిసార్లు అర్జెంట్‌గా డబ్బులు అవసరం అవుతుంటాయి.మనీ అవసరం ఉన్నప్పుడు చాలా మంది తమ స్నేహితులు, బంధువుల మధ్య అప్పు తీసుకోవడం లాంటివి చేస్తుంటారు.
ఇక ఎక్కడా డబ్బులు అడ్జెస్ట్ కాకపోతే బంగారం తనఖా పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు.ఇంకొందరు పర్సనల్ లోన్ తీసుకుంటారు.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిదా? లేక పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదా? దీని గురించే తెలుసుకుందాం.
ఎక్కువ మంది తీసుకునేలోన్స్‌లో గోల్డ్ లోన్, పర్సనల్ లోన్. గోల్డ్ లోన్ అంటే బంగారం తనఖా పెట్టి తీసుకుంటారు. పర్సనల్ లోన్ డాక్యుమెంట్స్ లేకుండా మనీ ఇస్తారు.
గోల్డ్ లోన్ అయితే బంగారం వాల్యూను బట్టి, బంగారంపై 75 నుంచి 80 శాతం వరకు డబ్బులు ఇస్తారు. మనీ పూర్తిగా చెల్లించిన తర్వాత గోల్డ్ ఇచ్చేస్తారు.
పర్సనల్ లోన్ ఈఎమ్‌ఐ రూపంలో నెలకు కొంత డబ్బులు చెల్లిస్తూ ఉండాలి. ఈ రెండింటిలో త్వరగా అప్రూవ్ అయ్యేది మాత్రం గోల్డ్ లోనే.
అయితే గోల్డ్ లోన్ 25 లక్షల వరకు లభ్యం కాగా, పర్సనల్ లోన్ 20 లక్షల వరకు పొందవచ్చును. కానీ గోల్డ్ లోన్ కంటే పర్సనల్ లోన్ ఈఎమ్ ఐ పీరియడ్ ఎక్కువ ఉంటది.
ఇక అర్జెంట్ మనీ కోసం అయితే గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిదంట. కానీ ఎక్కువ డబ్బు, చాలా కాలానికి కావాలి అనుకునే వారు మాత్రం పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపడం ఉత్తమం.