స్మార్ట్‌ఫోన్‌ వాడకం.. ఆత్మహత్యకు దారి తీయొచ్చు.. షాకింగ్‌ 

12 December 2023

స్మార్ట్ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి వచ్చింది. ప్రతీ చిన్న పనికి స్మార్ట్‌ఫోన్‌ అనివార్యంగా మారింది. అయితే అవసరానికి మంచి ఫోన్‌ వినియోగం పెరిగిపోయింది.

మరీ ముఖ్యంగా చిన్నారులు సైతం స్మార్ట్‌ ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌లతో కుస్తీ పడుతున్నారు.

ఒకప్పుడు గ్రౌండ్స్‌లో ఆడుకునే పిల్లలు ఇప్పుడు.. చేతిలో స్మార్ట్ ఫోన్‌ పట్టుకొని గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారు. 

మితిమీరిన స్మార్ట్ ఫోన్‌ వినియోగం చిన్నారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

దక్షిణ కొరియాకు చెందిన హన్యాంగ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి

రోజుకు నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లతో గడిపే యుక్తవయసు పిల్లలకు తీవ్ర నష్టం కలుగుతున్నట్టు ఈ అధ్యయానంలో వెల్లడైంది.

స్మార్ట్‌ఫోన్‌ అతి వినియోగం కారణంగా.. మానసిక జబ్బులతో పాటు నిద్ర, కళ్లు, ఎముకలకు అంటుకునే కండరాల సమస్యలకూ దారితీస్తున్నట్టు చెబుతున్నారు. 

అంతేకాకుండా రోజుకు నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్‌ వాడేవారిలో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, దురలవాట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు.