ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణపతకం గెలుచుకున్నాడు. అలాగే అతని విజయం యావత్ భారతదేశానికి గర్వంగా నిలిచింది.
ఇదిలా ఉండగా.. నీరజ్‌కి కార్లంటే విపరీతమైన ఇష్టమంట. అతని ఇంట్లో బైకులు, కార్లు మాత్రమే కాక ట్రాక్టర్ కలెక్షన్ కూడా ఉంది.
నీరజ్ చోప్రా ఇంటి గ్యారెజ్‌లోని కార్ కలెక్షన్‌లో రేంజ్ రోవర్, మహీంద్రా XUV 700, ఇంకా ఫార్చ్యూనర్ కూడా ఉన్నాయి.
నీరజ్ చోప్రా కలెక్షన్‌లో మొత్తం 6 కార్లు, 8 బైకులు, 7 ట్రాక్టర్లు ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. నీరజ్ చోప్రా కుటుంబం ఇప్పటికీ వ్యవసాయం చేస్తోంది.
అలాగే నీరజ్ చోప్రా కలెక్షన్‌లో హార్లే డేవిడ్‌సన్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పాటు ఇతర బైక్‌లు మొత్తం 8 ఉన్నాయి.
కాగా, నీరజ్ చోప్రా ఇప్పటివరకు భారత్ తరఫున 23 పతకాలు సాధించాడు. ఇక అతని పతకాల ప్రస్థానం 2016 దక్షిణాసియా క్రీడల్లో ప్రారంభమైంది.
నీరజ్ బంగారు పతాకల గురించి చెప్పుకోవాలంటే.. 2016 దక్షిణాసియా క్రీడలు, 2016 ప్రపంచ అండర్ 20 చాంపియన్‌షిప్, 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.
అలాగే 2018 సావో గేమ్స్, 2018 ఆసియా క్రీడలు, 2020 అథ్లెటిక్స్ సెంట్రల్ నార్త్ వెస్ట్ లీగ్ మీట్, 2021 సిడేడ్ డి లిస్బోవా మీట్, 2021 ఫోల్క్‌సం గ్రాండ్ ప్రిక్స్ టోర్నీల్లో కూడా బంగారు పతకాలను అందుకున్నాడు.
ఈ క్రమంలోనే 2021 టోక్యో ఒలంపిక్స్ ద్వారా అథ్లెటిక్స్‌లో భారత్‌కి తొలి బంగారు పతకాన్ని అందించాడు. ఆ తర్వాత 2022 కర్టెన్ గేమ్స్‌లో మళ్లీ గోల్డ్ మెడల్ సాధించాడు.
తాజాగా 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించాడు.