05 August 2023
17 ఏళ్ల అదితి గోపీచంద్ స్వామి ఒకే దెబ్బకు రెండు పిట్టలను పట్టేసింది.
భారతదేశ చరిత్రలో తొలి వ్యక్తిగత ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అందించింది.
చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ సంవత్సరం ఆమెకు చిరస్మరణీయమైనది.
సీనియర్ స్థాయిలో డబుల్ ఛాంపియన్ కావడానికి ముందు, గత నెలలో జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో డబుల్ ఛాంపియన్‌గా నిలిచింది.
యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అదితి వ్యక్తిగత, టీమ్ ఈవెంట్ స్వర్ణాన్ని కూడా గెలుచుకుంది.
అదితితో పాటు భారత క్రీడాకారిణి జ్యోతి సురేఖ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీ ఫైనల్లో జ్యోతిని అదితి ఓడించింది.
ఫైనల్‌లో అదితి 149-147తో మెక్సికోకు చెందిన ఆండ్రియా బక్వెరాను ఓడించింది.
అదితి కంటే ఆండ్రియా చాలా అనుభవజ్ఞురాలు. ఆమె 2021లో కాంస్యం గెలుచుకుంది.
కానీ అదితి తన ప్రతి షాట్‌కు సమాధానం ఇచ్చింది.
కానీ అదితి తన ప్రతి షాట్‌కు సమాధానం ఇచ్చింది.