పక్షులు తమ ఇంటికి వెళ్ళే దారిని ఎలా గుర్తిస్తాయి
TV9 Telugu
07 January 2024
పక్షులు సముద్రాలు దాటుకుని సుదూర ప్రాంతాలకు ఎలా వలస పోగలుగుతున్నాయి? దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించారు శాస్త్రవేత్తలు.
పూర్వకాలంలో మనుషులు అయస్కాంత దిక్సూచితో ఉత్తర, దక్షిణాలను గుర్తించడం మనకు తెలిసిన విషయమే. ఇప్పటి కొంతమంది వాటిని ఉపయోగిస్తున్నారు.
పక్షుల్లో 'సజీవ అయస్కాంత దిక్సూచి' అంతర్గతంగా ఇమిడి ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
పక్షుల కంటిలోని ఒక రసాయనం అయస్కాంతానికి స్పందిస్తుంది. భూ అయస్కాంత క్షేత్రాన్ని పక్షులు చూడగలవు అంటున్నారు.
వలస పోయే పక్షుల్లో ఒక పరమాణువు భూ అయస్కాత క్షేత్ర దిశను గుర్తించగలుగుతాయి. దీంతో వేలాది కిలోమీటర్లు వలసపోగలుగుతున్నాయి.
పక్షులు వాటి ముక్కులు, కళ్ళు మరియు లోపలి చెవులలో మాగ్నెటైట్ స్ఫటికాలను కలిగి ఉంటాయి. ఈ స్ఫటికాలు చిన్న దిక్సూచిలా పనిచేస్తాయి.
వీటిలో ఉన్న మాగ్నెటైట్ స్ఫటికాలు అయస్కాంత క్షేత్రం వైపు తమ దిశను నిర్ణయించడానికి పక్షులను అనుమతిస్తుంది.
పక్షులు నావిగేట్ చేయడానికి దృశ్య మైలురాళ్లు, సుపరిచితమైన పరిసరాలను కూడా ఉపయోగిస్తాయి. ప్రకృతిలోని పర్వతాలు, నదులు బీచ్‌లను గుర్తిస్తాయి.
పక్షులు పగలు, రాత్రి నావిగేట్ చేయడానికి సూర్యుడు, నక్షత్రాల స్థానాన్ని ఉపయోగిస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి